కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదని ఆ క్లిప్పింగ్ విన్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. ఒకవేళ పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఆయన కామెంట్లు ఉంటే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్ సభలో రాహుల్ చెప్పినట్లు బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఠాక్రే తేల్చిచెప్పారు. రాహుల్ చెప్పిన విషయాలకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అని అన్నారు.
అంతకుముందు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు సెక్యులర్ పార్టీలని అన్నారు.