Pushpa 2: ప్రసాద్ మల్టీప్లెక్స్లో పుష్ప-2 షోస్ ఇంకా పెట్టకపోవడం ఏంది..? దీని వెనుక పెద్ద కథే ఉందిగా..

Pushpa 2: ప్రసాద్ మల్టీప్లెక్స్లో పుష్ప-2 షోస్ ఇంకా పెట్టకపోవడం ఏంది..? దీని వెనుక పెద్ద కథే ఉందిగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) మూవీ గురువారం (డిసెంబర్ 5న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకుని పుష్ప రాజ్ మేనియా కొరకు ఎదురుచూస్తున్నారు.

బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా వస్తోన్న పుష్ప 2 మూవీ.. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో (Prasad Multiplex) మాత్రం రిలీజ్కు నోచుకోలేదట. అదేంటీ అసలు సినిమా వస్తుందంటే.. ఆడియన్స్, నెటిజన్స్, రివ్యూవర్స్ అంత చూసేది ప్రసాద్ మల్టీప్లెక్స్ వైపే కదా.. అక్కడ రిలీజ్ కాకపోవడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. శుక్రవారం వస్తుందంటే గురువారం ప్రీమియర్స్ పడేది ఇక్కడే. ఇపుడు పుష్ప 2 ప్రీమియర్స్ అండ్ రిలీజ్ కూడా లేకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్లో భారీ హైప్ ఉన్న సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్లో రిలీజ్ కాకపోవడం ఇదే ఫస్ట్ టైం. అందుకు తగిన కారణాలు లేకపోలేదట. మల్టీప్లెక్స్‌లు-మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య త‌లెత్తిన‌ వివాదం కార‌ణంగానే పుష్ప 2 రిలీజ్ కాదని టాక్. డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్‌లలో సినిమాను ప్రదర్శించడానికి వెనుకడగు వేస్తున్నారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల మాదిరిగా కాకుండా 50:50 ఆదాయ-భాగస్వామ్య నిష్పత్తిని వారు డిమాండ్ చేస్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు కేవలం సింగిల్-స్క్రీన్ థియేటర్లపైనే ఆధారపడేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంతలో, ఏషియన్ సినిమాస్ మరియు PVR తో ఉన్న ఆ ర‌క‌మైన సమస్యను డిస్ట్రిబ్యూటర్లచే పరిష్కరించకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ల నిబంధ‌న‌ల‌కు మ‌ల్టీప్లెక్స్ చైన్ దిగొచ్చినా? ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్ మాత్రం అందుకు ససేమీరా అంటుందట. ఇక డిస్ట్రిబ్యూటర్లు తమ నిబంధనలకు రాని పక్షంలో ప్రసాద్ మల్టీప్లెక్స్లో పుష్ప 2 సినిమాను ప్రదర్శించకూడదని డిసైడ్ అయిందట. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏ మాత్రం రాజీ పడేందుకు ఇష్టపడటం లేదని సమాచారం.

ఇక ఇలా కండిషన్స్తో ఉన్న.. ప్రసాద్ మల్టీప్లెక్స్-డిస్ట్రిబ్యూటర్లు యుద్ధం కారణంగా పుష్ప 2 రిలీజ్కు నోచుకోలేదని తెలుస్తోంది. ఏమవుతుందో చూడాలి.