- రిటైర్మెంట్ ఏజ్ పెరిగినా సింగరేణిలో దక్కని ప్రయోజనాలు
- 60 ఏళ్ల వరకే పీఎఫ్అమలు
- ముందస్తుగా స్పందించని సింగరేణి
- ఆర్థికంగా నష్టపోనున్న ఎంప్లాయీస్
మందమర్రి, వెలుగు:సింగరేణి ఉద్యోగులు, ఆఫీసర్లకు సీఎంపీఎఫ్ బెనిఫిట్స్60 ఏళ్ల వరకు మాత్రమే వర్తించనున్నాయి. గతేడాది రాష్ట్ర సర్కార్ సంస్థలో పనిచేసే కార్మికుల రిటైర్మెంట్ ఏజ్60 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీన్ని మార్చి 2021 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఏజ్పెంపుదలతో రిటైర్అయిన 1,082 మందికి ఏడాది పాటు మళ్లీ డ్యూటీ చేసే చాన్స్దక్కింది. దీంతోపాటు సంస్థలో పనిచేస్తున్న 43,899 మంది ఉద్యోగులకు సర్వీసు వర్తించనుంది. రిటైర్మెంట్ఏజ్60 నుంచి 61ఏళ్లకు పెంచడంతో ఏడాదికి సంబంధించిన బొగ్గు గనుల భవిష్య నిధి పథకం (సీఎంపీఎఫ్), ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు అందుతాయని ఉద్యోగులు భావించారు. 60 ఏళ్ల లెక్క ప్రకారమే బొగ్గు గని కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని తాజాగా సీఎంపీఎఫ్కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో 61ఏళ్ల పాటు డ్యూటీ చేసిన సింగరేణియులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సర్కారుఆదేశాలతో రిటైర్మెంట్ఏజ్పెంచిన సింగరేణి యాజమాన్యం సీఎంపీఎఫ్ బెనిఫిట్స్ విషయంలో ముందస్తుగా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖతో చర్చించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
కార్మికులకు ఎట్ల చెల్లిస్తరు?
సీఎంపీఎఫ్ చట్టం ప్రకారం 12 శాతం పీఎఫ్ కింద, కుటుంబ పింఛను పథకం కోసం 7శాతం చొప్పున మొత్తం 19 శాతం ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధిస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం తన వాటా కింద పీఎఫ్అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు చివరి ఏడాది ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పెరుగుతాయి. సీఎంపీఎఫ్ నిల్వ డబ్బులు ఎక్కువగా ఉండటంతో వాటిపై వడ్డీ, పింఛను సైతం ఏడాది కాలానికి అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పెంచిన ఏడాది కాలానికి కార్మికులకు కేవలం జీతం తప్ప ఎలాంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలు వర్తించవన్న విషయం సీఎంపీఎఫ్నిర్ణయంతో తేలిపోయింది. దీని వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. 2022 మార్చి తర్వాత రిటైర్అయిన ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్ స్కీం కింద కోత విధించిన మొత్తాలను ఏ విధంగా చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. యాజమాన్యం వాటా కలిపి సింగరేణి సంస్థనే ఈ కోత విధించిన మొత్తాలను చెల్లిస్తుందా.. లేదా కేవలం ఉద్యోగుల వాటానే తిరిగి ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. రానున్న కాలంలో 61 ఏళ్ల తర్వాత రిటైర్అయ్యే ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురుకానుంది.
కార్మికులు నష్టపోకుండా చూడాలి:
రిటైర్మెంట్ఏజ్61ఏళ్లకు పెంచడంతో మళ్లీ డ్యూటీలో చేరిన కార్మికులు ఏడాది కాలానికి సంబంధించి సీఎంపీఎఫ్ బెనిఫిట్స్నష్టపోకుండా రాష్ట్ర సర్కార్, సింగరేణి సంస్థ చర్యలు తీసుకోవాలి. ఏజ్పెంచడంతో సింగరేణిలో అన్ని రిజిస్టర్డ్స్టాండింగ్ఆర్డర్స్మార్చాలని ఇప్పటికే అన్ని జాతీయ, సింగరేణి కార్మిక సంఘాలు రీజినల్లేబర్ కమిషనర్వద్ద సంతకాలు పెట్టాయి. రాష్ట్ర సర్కార్, సింగరేణి యాజమాన్యం కార్మికులకు న్యాయం చేయాలి.
- యాదగిరి సత్తయ్య, బీఎంఎస్స్టేట్ ప్రెసిడెంట్