కరోనాతో బిజినెస్ లేదని…

కరోనాతో బిజినెస్ లేదని…

లాడ్జిని బ్రోతల్ హౌస్ గా మార్చిండు

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో పాటు కరోనా కారణంగా బిజినెస్ దెబ్బతినటంతో ఓనర్ లాడ్జిని వ్యభిచార గృహంగా మార్చి నిర్వహిస్తున్నాడు. షాపూర్ నగర్ లో సత్యనారాయణ అలియాస్ రాజేశ్ కొన్నేళ్లుగా రాఘవేంద్ర లాడ్జిని నడుపుతున్నాడు. కరోనా కారణంగా లాడ్జికి వచ్చే వారు లేకపోవటంతో కొంతకాలంగా వ్యభిచారం గృహంగా మార్చి కొనసాగిస్తున్నాడు. అనుమానం రావడంతో పోలీసులు బుధవారం రైడ్ చేశారు. నలుగురు విటులు, నలుగురు యువతులతో పాటు ఓనర్ ను అరెస్ట్​ చేసినట్లు ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు.