Laila: వెయ్యి థియేటర్లలో లైలా మూవీ : టికెట్ల బుకింగ్స్ పై అందరిలో ఆసక్తి

Laila: వెయ్యి థియేటర్లలో లైలా మూవీ : టికెట్ల బుకింగ్స్ పై అందరిలో ఆసక్తి

లైలా.. విశ్వక్ సేన్ మూవీ థియేటర్లలో సందడి చేయటానికి రెడీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి ధియేటర్లలో విడుదల అవుతుండగా.. అన్ని సినిమా హాళ్లల్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ప్రారంభం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొడవ క్రమంలో.. టికెట్ల అమ్మకాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో ఏ రేంజ్ లో టికెట్లు బుక్ అవుతాయి అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

2025 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు మాత్రం తెగడం లేదు. బుక్ మై షోలో ఏ థియేటర్ చూసినా దాదాపుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో చిత్ర యూనిట్, నిర్మాతలలో ఆందోళన మొదలైంది. ఒకవేళ శుక్రవారం ఫస్ట్ తర్వాత పాజిటివ్ టాక్ పడితే వీకెండ్ శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కూడా కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ALSO READ | అడల్ట్‌‌ కాదు.. యూత్‌‌ కంటెంట్‌‌తో లైలా

ఈ గొడవ క్రమంలోనే.. వైసీపీకి కౌంటర్ గా టీడీపీ, జనసేన పార్టీలు, నందమూరి, మెగా ఫ్యాన్స్ అభిమానులు లైలా మూవీకి సపోర్ట్ ఇచ్చారు. ఇది మరింత ఆసక్తిగా మారింది. ఫస్ట్ డే.. ఫస్ట్ షోకు విశ్వక్ సేన్ అభిమానులతోపాటు టీడీపీ, నందమూరి, జనసేన, మెగా ఫ్యాన్స్ ఎంత మంది వస్తారు.. ఎన్ని టికెట్లు బుక్ చేస్తారు అనేది అందరిలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ మూవీని సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్ కాట్ చేసింది.. ఇప్పుడు ఇది రెండో సినిమా. అప్పుడు, ఇప్పుడు.. ఈ సినిమాకు.. ఈ సినిమాకు చిచ్చు ప పెట్టింది.. ఓవర్ కామెంట్స్ చేసింది ఇదే పృధ్వీ కావటం విశేషం. ఈ క్రమంలోనే లైలా మూవీ ఫస్ట్ డే.. ఫస్ట్ షో కలెక్షన్స్.. టాక్ పై ఆసక్తి నెలకొంది.