సంక్రాంతి పండుగ అంటే ఊర్లు వెళ్లటమే.. పట్టణాల నుంచి పల్లెలకు.. పల్లెల నుంచి పట్టణాలకు ఇలా జనం సొంతూరుకు వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సందడి అలా ఇలా ఉండదు.. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతారు. తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేస్తుంటారు.. ఊరెళ్లొచ్చిన వాళ్లకు షాక్ లు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ సారాంశం ఇలా ఉంది..
ఓ ఇంటి యజమాని సంక్రాంతికి ఊరెళుతూ.. ఇంటి తలుపునకు ఇలా ఓ కాగితం అంటించాడు.. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలు కూడా తీసుకుని వెళ్తున్నాం.. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ దొంగలకు పని తగ్గించాడు. ఈ కాగితం ముక్కను ఇంటి డోర్ కు అంటించాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దొంగలకు పని తగ్గించారు.. దొంగల కష్టం విలువ తెలిసిన వ్యక్తి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే మీ తెలివైన నిర్ణయానికి హ్యాట్సాఫ్ బాస్ అంటున్నారు.. మరికొందరు అయితే మీరు అలా రాశారు అంటే.. మీ ఇంట్లో ఏదో ఉంది అనుకుని దొంగలు దోపిడీకి రావొచ్చు అంటూ రివర్స్ పంచ్ లు వేస్తున్నారు. కొన్ని సార్లు అతి తెలివి అనేది అసలుకు మోసం తెస్తుంది అని సెటైర్లు వేస్తున్నారు.
ఏదిఏమైనా సంక్రాంతికి ఊరెళ్లిన వాళ్లు ఇంటి చుట్టుపక్కల వాళ్లకు చెప్పటం.. పోలీసులకు సమాచారం ఇవ్వటం అనేది ఓల్డ్ ఫ్యాషన్.. ఇప్పుడు డైరెక్ట్ గా దొంగలకే సమాచారం ఇవ్వటం అనేది లేటెస్ట్ వెర్షన్ అంటున్నారు నెటిజన్లు. ఇది ఎక్కడ.. ఏ ప్రాంతం అని స్పష్టంగా తెలియకపోయినా.. సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది..