![హమ్మయ్య.. ఆ ట్యాక్స్లు పెంచడం లేదు.. రేపు (ఫిబ్రవరి 13) పార్లమెంటులో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు..](https://static.v6velugu.com/uploads/2025/02/no-change-in-stcg-and-ltcg-in-new-income-tax-bill-and-new-cocpet-of-tax-year-to-be-introduced_57DhFZnLKN.jpg)
కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 13) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే Income Tax Bill-2025 ఏఏ మార్పులు ఉండనున్నాయనే ప్రశ్నలు ప్రతి టాక్స్ పేయర్ లో ఉన్నాయి. అయితే రేపటి బిల్లులో సంక్లిష్టమైన కొన్ని కాన్సె్ప్టులను తొలగించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కాన్సెప్ట్స్, టర్మినాలజీని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కు ఊరట కలిగించేలా 12 లక్షల రూపాయల టాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేపటి బిల్లులో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించే అంశాలను చేర్చారు. అందులో భాగంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG), షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) పై టాక్స్ పెంచే యోచనలో ప్రభుత్వం లేదని స్పష్టమైంది.
Also Read :- సాఫ్ట్వేర్ కంపెనీలో చేరితే.. లక్ష జీతం.. ఫ్రీగా మందు
స్టాక్స్, ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్, ఎస్ఐపీ(SIP) తదితర పెట్టుబడులపై LTCG, STCG ని యదాతథంగా ఉంచనున్నారు. అంటే ఈ పెట్టుబడులపై వచ్చిన లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లాభాలపై టాక్స్ ను పెంచకుండా ఇంతకు ముందు ఉన్న టాక్స్ నే కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు STCG టాక్స్ 20 % గా ఉండగా.. LTCG పై టాక్స్ 12.5 శాతం ఉంది. గతంలో 15 శాతం ఉన్న STCG టాక్స్ ను 2024 బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 5 శాతం పెంచుతూ 20 శాతానికి చేర్చారు. అయితే ఈ సారి ఈ టాక్స్ లు పెంచక పోవడం ఇన్వెస్టర్లకు, స్టాక్ మార్కెట్లకు సానుకూలమైన వార్తగా చెప్పవచ్చు.
టాక్స్ పేయర్స్ కోసం కొత్త కాన్సెప్ట్ ‘Tax Year’:
కొత్త ఇన్ కమ్ టాక్స్ 2025 బిల్లులో టాక్స్ పేయర్స్ కోసం ‘టాక్స్ ఇయర్’ అనే కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టనున్నారు. గతంలో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ వంటి కాన్సెప్ట్ ల స్థానంలో టాక్స్ ఇయర్ ను చేర్చుతున్నారు. టాక్స్ ఇయర్ కాన్సె్ప్ట్ తెచ్చినప్పటికీ.. ఫైనాన్షియల్ ఇయర్ అర్థం మారదు. యదావిధిగా ఏప్రిల్ 1 నుంచే ప్రారంభం అవుతుంది.
ఈ టాక్స్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం అయ్యే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. దీని ప్రకారమే టాక్స్ ప్లేయర్లు టాక్స్ ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ బిజినెస్ ఏదైనా టాక్స్ ఇయర్ మధ్యలో ప్రారంభించి, మధ్యలో లాభాలు స్వీకరిస్తుంటే.. ఆ బిజినెస్ స్టార్ట్ డేట్ ఆధారంగా టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. లేదంటే కొత్త ఇన్ కమ్ స్టార్ట్ అయిన తేదీ నుంచి టాక్స్ కట్టే ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత న్యూ ట్యాక్స్ ఇయర్ అధారంగా చెల్లించాల్సి ఉంటుంది.