వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో ఇచ్చిన సుప్రీంకోర్టు : అప్పటి వరకు నియామకాలు ఆపేయండి

వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో ఇచ్చిన సుప్రీంకోర్టు : అప్పటి వరకు నియామకాలు ఆపేయండి

పార్లమెంట్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంపై యధాతథ స్థితి కొనసాగించాలని.. తదుపరి విచారణ తర్వాత ఎలాంటి నియామకాలు, చర్యలు తీసుకోవద్దు అంటూ కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ చేస్తున్న ధర్మాసనం.. 2025, ఏప్రిల్ 17వ తేదీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మే 5వ తేదీన ఉంటుందని.. అప్పటి వరకు ఎలాంటి వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి జోక్యం చేసుకోవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు.

వక్ఫ్ చట్టంలో ఉన్న వక్ఫ్ బై యూజర్ నిబంధనను డీనోటిఫై కూడా చేయొద్దని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. వక్ఫ్ బోర్డులో నియామకాలను కూడా చేయొద్దని.. కొత్త చట్టం ప్రకారం సుప్రీంలు కాని వారిని కూడా వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేస్తుందని.. దీనిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

►ALSO READ | ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్లిస్తం.. వెళ్లిపోండి!..అక్రమ వలసదారులకు ట్రంప్‌‌ ఆఫర్‌‌

ఏప్రిల్ 8వ తేదీ  నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డుకు వారసత్వంగా.. కొన్ని తరాలుగా వస్తున్న ఆస్తులు అయినా సరే.. వాటికి సరైన పత్రాలు, డాక్యుమెంట్లు లేకపోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.. దీనిపైనా పిటీషన్లు దాఖలు అయ్యాయి. 14, 15 శతాబ్దాల నుంచి కొన్ని మసీదులు, దర్గాలు ఉన్నాయని.. వాటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వస్తాయనేది ముస్లిం సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపైనా విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ జరిగే మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులపైనా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు ఇచ్చింది.

ఇస్లాం మతంలోకి మారిన తర్వాత.. ఐదేళ్లు ఇస్లాం మతంలోనే ఉన్నప్పుడే వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఇవ్వటానికి అర్హులనే నిబంధనపైనా వివాదం కొనసాగుతుంది. వీటన్నింటిపైనా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తదుపరి ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుందని.. అప్పటి వరకు యధాథస్థితి కొనసాగుతుందని వెల్లడించింది సుప్రీంకోర్టు.