మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు బీజేపీ అధిష్టానం. అయితే కొందరి పేర్లను మాత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఇవాళ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సోరోఖైబామ్ రాజేన్ సింగ్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి అపద్ధర్మ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, ఎమ్మెల్యేలు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు రిజైన్ లెటర్ ను సమర్పించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు తన కార్యాలయంలో కొనసాగాలని కోరారు. అయితే మణిపూర్ సీఎంగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందా అన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం ఈనెల 19తో ముగియనుంది.
మరిన్ని వార్తల కోసం
నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా బాంబులు
తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు