మల్యాల ఎంపీపీపై అవిశ్వాసం

మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు బుధవారం అవిశ్వాస నోటీస్​ అందజేశారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా,  10 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆర్డీవోకు నోటీస్​ ఇచ్చిన వారిలో కాంగ్రెస్ నుంచి నలుగురు,  బీఆర్ఎస్ నుంచి నలుగురు,  బీజేపీ నుంచి ఇద్దరు ఉన్నారు.