
నారాయణఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం నజీబ్, వైస్ చైర్మన్ అహీర్ పరశురాంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ఆఫీస్ఏఓ పరమేశ్వర్ ను కలిసి సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీస్‌ను అందజేశారు. గత ఎన్నికల్లో ఖేడ్‌లోని 15 వార్డుల్లో 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్గెలుచుకుంది.
అయితే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్చైర్మన్పదవులు దక్కించుకుంది. 15వ వార్డు నుంచి ఎన్నికైన రుబీనా బేగం నజీబ్ చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్మన్ గా 5వ వార్డు నుంచి గెలిచిన అహీర్ పరశురాం ఎన్నికయ్యారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో వార్డు కౌన్సిలర్సంధ్యారాణి రామకృష్ణ, 12వ వార్డు కౌన్సిలర్ మాజీద్, 8వ వార్డు కౌన్సిలర్ నర్సింహులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. మున్సిపల్ చైర్పర్సన్ గా ఆరో వార్డు కౌన్సిలర్ఆనంద్ స్వరూప్ షెట్కార్ ను, వైస్ చైర్మన్‌గా మూడో వార్డు కౌన్సిలర్దారం శంకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.