- 10 మంది ఎంపీటీసీల తిరుగుబాటు
రామడుగు, వెలుగు: రామడుగు ఎంపీపీ కలిగేటి కవితకు వ్యతిరేకంగా 10 మంది ఎంపీటీసీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఆర్డీవోకు అందజేశారు. మొత్తం 14 ఎంపీటీసీల్లో 10 మంది నోటీస్‌పై సైన్చేయగా వారిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, మిగతా నలుగురు బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్లు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీకి అనుకూలంగా జట్టు కట్టి అవిశ్వాసం నోటీస్ ఇచ్చినట్లు తెలిసింది.