
వేములవాడ, వెలుగు: వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీ రవిచందర్‌రావుపై ఆరుగురు ఎంపీటీసీలు ఆర్డీవోకు మంగళవారం అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. అర్బన్ మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలుండగా ముగ్గురు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కరు చొప్పున గెలిచారు. ఇటీవల చీర్లవంచ ఎంపీటీ దేవరాజు(బీఆర్ఎస్) కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఎంపీపీగా బూర వజ్రవ్వ కొనసాగుతున్నారు.