వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాసం

వికారాబాద్  జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాసం

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు శనివారం బీఆర్ఎస్ జడ్పీటీసీలు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ కు తీర్మానపత్రం అందించారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జడ్పీ చైర్ పర్సన్ కాంగ్రెస్ లో చేరారు.  జిల్లాలో మొత్తం 18 మంది జడ్పీటీసీలు ఉండగా వీరిలో 14 మంది బీఆర్ఎస్

 చైర్ పర్సన్ తో పాటు నలుగురు కాంగ్రెస్ జడ్పీటీసీలు ఉన్నారు. మెజారిటీ సభ్యులున్న బీఆర్ఎస్ జడ్పీటీసీలు 12 మంది అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో  గెలిచిన సునీతారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్నం ఫ్యామిలీతో పార్టీ నష్టమే తప్పా లాభం లేదన్నారు.