- మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై నెగ్గిన తీర్మానం
- ఈ మేరకు జనవరి 4న జరిగిన మీటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైకోర్ట్
- కొత్త చైర్పర్సన్ ఎన్నిక నోటిఫైకి ఎదురుచూపులు
- బడ్జెట్మీటింగ్ నిర్వహణ కోసం వైస్‌చైర్మన్‌కు పవర్స్ ఇస్తూ జీవో జారీ
నిజామాబాద్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై మెజార్టీ కౌన్సిలర్లు జనవరి 4న ఆమోదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లేనని హైకోర్ట్ స్పష్టం చేసింది. తీర్మానానికి అనుకూలంగా 17 ఓట్లు చాలగా, అంతకు మించి 24 ఓట్లు పడినందున ఆమె పదవి కోల్పోయిట్లేనని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఇదే తీర్పును డబుల్ బెంచ్ధర్మాసనం కూడా సమర్థించడంతో ఆమె పదవి కోల్పోయారు. దీంతో రెండు నెలలుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది.
స్టేట్ఎలక్షన్కమిషన్ నోటిఫై చేస్తూ ఆర్డర్జారీ చేస్తే కొత్త చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. అయితే ఇందుకు టైమ్పట్టేలా ఉంది. మరోపక్క మార్చి నెలలోపు మున్సిపల్ వార్షిక బడ్జెట్ మీటింగ్నిర్వహించాల్సి ఉంది. మున్సిపల్ కు ప్రస్తుతం చైర్పర్సన్ లేనందున బడ్జెట్సమావేశాన్ని వైస్చైర్మన్అధ్యక్షతన నిర్వహించాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన జీవో శుక్రవారం ఆఫీసర్లకు అందింది.
అంతా గందరగోళం
బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత్వినీతను పదవి నుంచి దింపడానికి సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. జనవరి 4న మీటింగ్జరిగింది. ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మీటింగ్‌కు అటెండ్కావడం తికమకకు దారితీసింది. ఆయన్ను కౌంట్లోకి తీసుకోవాలా వద్దా? అని ఆఫీసర్ల కన్ఫ్యూజన్పై కోర్టు క్లారిటీ ఇచ్చింది. మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా సభ్యుల్లో 2/3 కోరం హాజరైతే అవిశ్వాస తీర్మానంపై స్పెషల్ మీటింగ్నిర్వహించవచ్చని భావించిన ఆఫీసర్లు అందుకనుణంగా 24 మంది కౌన్సిలర్లు అటెండ్ కాగా జనవరి 4న మీటింగ్ నిర్వహించారు.
వారంతా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. అదే విషయాన్ని ఆఫీసర్లు గవర్నమెంట్‌కు రిపోర్ట్ చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హాజరైన సమాచారం మొదట తెలపలేదు. అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుడిగా తన పేరు నమోదు చేయమని మున్సిపల్ కమిషనర్‌కు లెటర్ఇచ్చి అదే రోజు జరిగిన అవిశ్వాస మీటింగ్‌లో కూర్చున్నారు. కానీ ఓటు వేయలేదు. ఆయన మీటింగ్‌లో కూర్చోవడంపై వినీత హైకోర్ట్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి హాజరును లెక్కలోకి తీసుకుంటే మీటింగ్ నిర్వహణ 2/3 కోరం 25 సభ్యులుగా మారుతుందని, నోకాన్ఫిడెన్స్కు వారంతా ఓటు వేస్తేనే నెగ్గినట్లని వాదించారు.
ఎక్స్అఫీషియో సభ్యుడు రాకేశ్‌రెడ్డి ఓటు వేయనందున అవిశ్వాసం చెల్లదని వాదన వినిపించారు. రాష్ట్ర పురపాలక శాఖ కూడా దీన్ని సమర్థించి, తర్వాత నాలుకకరుచుకొని ఉపసంహరించుకుంది. అయితే కోర్టు అవిశ్వాస మీటింగ్‌కు ఎమ్యెల్యే సహా 25 మంది అటెండైనా కోరంను లెక్కలోకి తీసుకొని వారిలో 2/3 ఓట్లతో అవిశ్వాసాన్ని డిసైడ్ చేయాలని తేల్చిచెప్పింది. అంటే నోకాన్ఫిడెన్స్17 ఓట్లు చాలని అటెండైన వారిలో 24 మంది కౌన్సిలర్లు ఓటు వేసినందున అది నెగ్గినట్లేనని వెల్లడించింది. సింగిల్బెంచ్ఇచ్చిన తీర్పును డబుల్బెంచ్ కూడా సమర్థించడంతో వినీత పదవి నుంచి చిదిగిపోక తప్పలేదు.