
- పదవులు కోల్పోయిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు వీరిపై అవిశ్వాసం ప్రకటిస్తూ జనవరి 5న కలెక్టర్ ఆశిష్‌కు అవిశ్వాస నోటీసును అందజేశారు. ఈమేరకు సోమవారం ఆర్డీఓ రత్న కల్యాణి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్‌పై అవిశ్వాసానికి 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు పలికారు.
Also Read : గొల్లపల్లిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బీఆర్ఎస్కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్‌పై ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు వ్యతరేకంగా ఓటు వేయడం చర్చనీయంగా మారింది. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో నిర్వహిస్తామని ఆర్డీఓ తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం కావడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు.