భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యాయలం దగ్గర భారీ కడ్లు ఏర్పాటు చేశారు. అయినా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ నాయక్, మాజీ వైఫ్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ లు భారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి ప్రవేశించారు.
హరిప్రియ వెళ్లడాన్ని నిరసిస్తూ భారీ గేట్లు దాటి మున్సిపల్ ఆవరణంలోకి కాంగ్రెస్ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.