మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 19 మంది కార్పొరేటర్లు గురువారం మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు. ముఖ్య అతిథులుగా పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు.
అనంతరం మీడియాతో కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మేయర్ చెప్పుడు మాటలు విని, ఆడమన్నట్టు ఆడామని పేర్కొన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.