మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలపై పెట్టిన అవిశ్వాస ఓటింగ్సమావేశం కోర్టు ఉత్తర్వులతో వాయిదా పడింది. గత నెల 23న 10 మంది ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపడుతూ ఆర్డీవోకు నోటీసులు అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని ఆర్డీవో అప్పట్లో ప్రకటించారు.
ఎంపీపీ కోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. దీంతో బుధవారం నాటి సమావేశానికి 10 మంది ఎంపీటీసీలు హాజరుకాగా ఓటింగ్ వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో ప్రకటించారు. తదుపరి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ హైకమాండ్లు విప్జారీ చేసినా పలువురు ఎంపీటీసీలు హాజరయ్యారు.