కామారెడ్డి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌పై నెగ్గిన అవిశ్వాసం

కామారెడ్డి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌పై నెగ్గిన అవిశ్వాసం

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి మున్సిపల్ చైర్​పర్సన్​నిట్టు జాహ్నవి(బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌​)పై ​కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు ఉండగా... కాంగ్రెస్​ చెందిన 27మంది కౌన్సిలర్లు చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌పై ఇటీవల కలెక్టర్​కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.  దీనిపై శనివారం మున్సిపల్​ కౌన్సిల్​హాల్‌‌‌‌లో కలెక్టర్​ జితేష్​ పాటిల్​ఆధ్వర్యంలో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు.

 34 మంది కౌన్సిలర్ల కోరం అవసరం ఉండగా.. 37మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో 27మంది కాంగ్రెస్‌‌‌‌ కాగా, 10 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అసమ్మతి కౌన్సిలర్లు ఉన్నారు.  అవిస్వాస పరీక్ష నిర్వహించగా.. 37మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.  

క్యాంప్‌‌‌‌ నుంచి నేరుగా.. 

క్యాంపులో ఉన్న కాంగ్రెస్​ చెందిన 27మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో హైదరాబాద్​ నుంచి నేరుగా కామారెడ్డికి చేరుకున్నారు. వీరి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ ఆలీ, ఇతర నాయకులు ఉన్నారు.  వీళ్లు వచ్చిన కొద్దిసేపటికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన 10 మంది అసమ్మతి కౌన్సిలర్లు ప్రత్యేక వెహికల్స్‌‌‌‌లో మున్సిపాలిటీకి వచ్చారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌, బీఆర్ఎస్‌‌‌‌కు చెందిన కౌన్సిలర్లు మీటింగ్ రాలేదు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్​ సుజాత పాల్గొన్నారు.  డీఎస్పీ నాగేశ్వర్​ రావు ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.