హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం

హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 22 బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని  ప్రతిపాదిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఇన్ వార్డులో  లేఖను అందజేశారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా చైర్పర్సన్ రాధిక సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని,  తమ వార్డులకు నిధులు కేటాయించడంలేదని అవిశ్వాస లేఖలో పేర్కొన్నారు. చైర్పర్సన్  భర్త బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.  వెంటనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.