కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు వద్దు

కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు వద్దు
  • సీఎం రేవంత్ రెడ్డికి పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ ఎలాంటి ఫ్లైఓవర్లను నిర్మించొద్దని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఫ్లైఓవర్లను నిర్మిస్తే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని.. దీనివల్ల కొన్ని ఎకరాల పార్కు భూమి పోతుందని తెలిపారు. పర్యావరణంపై ప్రభావం పడుతుందని, పార్కు ఉనికి తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. 

ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కోరారు. పార్కు వరదలను కూడా ఆపుతుందని పేర్కొన్నారు. 2020లో భారీ వర్షాలు కురవడంతో అప్పట్లో చుట్టు పక్కల ప్రాంతాలు వరద ముప్పు నుంచి తప్పించుకున్నాయని వివరించారు. పార్కుని రక్షించుకోవడం అందరిపై ఆధారపడి ఉందన్నారు. గతంలో తమ మాటని బీఆర్ఎస్​ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, అప్పట్లోనూ ఎన్జీటీకి వెళ్లామన్నారు. కాంగ్రెస్ సర్కారు మరోసారి ఆలోచించి వీటి నిర్మాణాలపై వెనక్కి తగ్గాలని కోరారు. మొత్తం 31 మంది నిపుణుల సంతకాలతో కూడిన లేఖను సీఎంకు రాశారు.