జనాభా లెక్కించకుండా డీలిమిటేషన్​ వద్దు.. వాజ్ పేయ్ కూడా అదే చెప్పారు: జైరామ్​ రమేశ్​

జనాభా లెక్కించకుండా డీలిమిటేషన్​ వద్దు.. వాజ్ పేయ్ కూడా అదే చెప్పారు: జైరామ్​ రమేశ్​

ఢిల్లీ: కొత్తగా జనాభా లెక్కించకుండా డీలిమిటేషన్​ ప్రక్రియ చేపట్టవద్దని కాంగ్రెస్ సీనియన్​ నేత జైరామ్​ రమేశ్​ డిమాండ్​ చేశారు. ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్నారు. 

ఇవాళ (మార్చి 22) ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. '2002లోనే నాటి ప్రధాని వాజ్ పేయ్ 2026 వరకు వాయిదా వేస్తూ సవరణ చేశారు. నాటి సవరణ 2031లో జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలి. 2025 అంచనా ప్రకారం జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రక్రియ చేపడితే ఫ్యామిలీ ప్లానింగ్​ సక్రమంగా అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు' అన్నారు.