60 ఏండ్లల్ల ఏమీ జరగలె..

  • ఎనిమిదేండ్లల్లనేఅన్నీ చేసినం
  • పార్లమెంట్​ రూల్స్​ తెల్వనాయన ప్రధాని అయిండు
  • కిషన్​రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నరని ఫైర్
  • తెలంగాణ రాక ముందు ఇంటింటికి నల్లా నీళ్లిచ్చిన్రా: కేటీఆర్​

రాజన్నసిరిసిల్ల/తంగళ్లపల్లి, వెలుగు: స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్​ చేసి చూపెట్టారని మంత్రి కేటీఆర్​ అన్నారు.  ‘‘తెలంగాణ రాకముందు ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నడా? తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు రావన్నరు... కొత్త పెట్టుబడులు రావన్నరు. కరెంటు రాదని కట్టె పట్టుకొని ఓ సీఎం చెప్పిండు. కానీ, 60 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేండ్లలో జరిగింది” అని చెప్పారు. కేసీఆర్​ను  ఎవ‌‌రైనా ఒక్క మాట అన్నా  ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘ఔలాగాడు, బేకూఫ్‌‌గాడు మాట్లాడితే బెద‌‌రొద్దు. ఏ నాయ‌‌కుడూ చేయ‌‌ని ప‌‌ని కేసీఆర్ చేసి తెలంగాణ‌‌ను అభివృద్ధి చేసిండు. కేసీఆర్​ను ఏమన్నా అంటే సహించేది లేదు. జన‌‌గామ‌‌, ఆర్మూర్‌‌లో బీజేపీ లీడర్లను పొట్టుపొట్టు తన్నిన్రు. హ‌‌ద్దులు దాటితే త‌‌ప్పకుండా బుద్ధి చెప్తం. సిరిసిల్ల గడ్డ మీద చైతన్యం చూపిస్తం” అని  అన్నారు. 

‘‘తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏమైనా అంటే.. ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడి వాళ్లం అక్కడ ఒక్కొక్క కార్యక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్త.. కేసీఆర్ లాగా ఫిరంగులై గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జించాలి. త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పకుండా విరుచుకుప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాలి. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్​ ఏం త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కువ చేసిండని బీజేపీ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీయాలి” అని టీఆర్​ఎస్​ కేడర్​కు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్లలో జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి కేటీఆర్  హాజరై మాట్లాడారు. అదేవిధంగా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్రం నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘జనధన్  అకౌంట్ తీస్తే రూ. 15 లక్షలు ఇస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఇచ్చిండా?  నమో అంటే నమ్మించి మోసం చేసెటోడు మోడీ” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. ‘‘పార్లమెంటు రూల్స్ తెలియనోడు దేశ ప్రధాని అవ్వడం దారుణం. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన మోడీకి , బీజేపీకి పుట్టగతులుండవు” అని హెచ్చరించారు. నరేంద్ర మోడీని ప్రధాని చేస్తే జీవితాలు బాగుపడతాయనుకుంటే జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేండ్లలో రైతుల కోసం, దళితుల కోసం మోడీ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వేముల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసుకురావాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బీజేపీ స్టేట్​ చీఫ్​, ఎంపీ బండి సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాల్ విసిరారు. ‘‘బీజేపీ అంటే బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వాస్ ఝూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందుకే ఈ కొత్త పేరు పెట్టినం. బీజేపీ బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టలిప్పి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్నంగా నిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెట్టాలి. చండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన బీజేపీ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధతులను ఎండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాలి. బండి సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్ ఎంపీగా గెలిచి మూడేండ్లయితున్నది.. ఈ కాలంలో మూడు పైస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా తేలే” అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ‘‘మోడీ కేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం ఉత్తర భార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తానికే ప్రధానమంత్రా? తెలంగాణ ప్రజల మీద ఎందుకింత వివక్ష” అని కేటీఆర్ ప్రశ్నించారు. 
ముష్టి వేసినట్లు రెండున్నర కోట్లు ఇచ్చిన్రు
‘‘మేడారం జాత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మినీ కుంభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా అంటరు. ఐదారు రాష్ట్రాల నుంచి లక్షల మంది భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్తులు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తరు. అట్లాంటి జాత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రం కేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్​లో  జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగిన కుంభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాకు రూ. 375 కోట్లు ఇచ్చింది. మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముష్టి వేసిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చింది. కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా అని అంటరు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక ట్రిపుల్ ఐటీ కావాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అడిగితే ఇవ్వలేదు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు?” అని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై కేటీఆర్​ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల పేరుతో చిచ్చు పెడుతూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు.  
ఒబులాపూర్​లో జాతరకు హాజరు
బద్దెనపల్లి రైతు వేదిక ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్​ ఒబులాపూర్​ గ్రామంలోని సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొన్నారు.అమ్మవార్లకు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
కాంగ్రెస్​ లీడర్ల ముందస్తు అరెస్ట్​
మంత్రి కేటీఆర్​ పర్యటన సందర్బంగా కాంగ్రెస్​ లీడర్లను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం కేటీఆర్​కు పరిపాటిగా మారందని కాంగ్రెస్​ పార్టీ మండల  ప్రెసి డెంట్​ ప్రవీణ్ జే టోని అన్నారు. ఉద్యోగ నోటిఫి కేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువ తను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్​ వచ్చినప్పుడల్లా తమను అరెస్ట్​ చేయడం మానుకోవాలన్నారు.