కరోనా ఎఫెక్ట్ తో సాదా సీదాగా గణేష్ నిమజ్జనాలు
హైదరాబాద్, వెలుగు: వినాయక చవితి హంగామా సిటీలో మాములుగా ఉండదు. నిమజ్జనం రోజు డీజేల హోరు, ఊరేగింపులతో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఈసారి మాత్రం కరోనా కారణంగా సాదాసీదాగా సాగిపోతోంది. మండపాలు, సామూహిక పూజల ద్వారా వైరస్ స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఉండటంతో ఎవరికి వారు ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్నారు. సామూహిక నిమజ్జనం కూడా ఉండదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ముందే స్పష్టం చేయడంతో ఎలాంటి ఆర్భాటమూ లేకుండా కొద్దిమందితోనే నిమజ్జనాలు చేస్తున్నారు.
మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ తో..
గణేశ్ నిమజ్జనం అంటే గుర్తొచ్చే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్, డప్పు చప్పుళ్లు, భక్తుల బారుల వంటివేమీ లేవు. ఏటా ఉదయం నుంచి తిరిగి తెల్లవారుజాము వరకు నిమజ్జనాలు జరిగేవి. ఈసారి మాత్రం సిటిజన్స్ సాయంత్రం, రాత్రి టైమ్ లో బైక్ మీదో, కారులోనో, స్పెషల్ గా తయారు చేస్తున్న చిన్న ట్రాలీలపైనో విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నా రు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నా రు. ఎకో ఫ్రెండ్లీ , సీడ్ గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇంట్లోనే కుండీల్లో నిమజ్జనం చేస్తున్నారు.