మధ్యాహ్నం దాకా కానరాని సిబ్బంది

ఎల్బీనగర్,వెలుగు: ఎల్బీనగర్​జోన్​పరిధిలో సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన బర్త్​అండ్​ డెత్​సర్టిఫికెట్ల సెక్షన్ సరూర్​నగర్​లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో కొనసాగుతోంది. ఇక్కడ దాదాపు ఏడుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల దాకా ఒక్క ఆఫీసర్​కూడా కుర్చీల్లో కనిపించలేదు.

పనిమీద ఆఫీసులకు వచ్చిన జనం వెనక్కి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.