బీసీ గురుకులాల్లో ప్రవేశానికి నో ఎంట్రెన్స్​ టెస్ట్​ 

బీసీ గురుకులాల్లో ప్రవేశానికి నో ఎంట్రెన్స్​ టెస్ట్​ 
  • మార్కుల ఆధారంగా ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులంలో ఇంటర్ , డిగ్రీ అడ్మిషన్లపై ఆ సొసైటీ కీలక నిర్ణయం తీసుకున్నది.  ప్రతి ఏటా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి, అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కు అడ్మిషన్లు ఇస్తుండగా.. ఆ విధానాన్ని రద్దు చేసింది.  దీంతోపాటు విద్యాశాఖ అనుబంధంగా ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఆర్​ఈఐఎస్​) లో కూడా ఎంట్రెన్స్  టెస్ట్​ లేకుండా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎంట్రెన్స్​ ఎగ్జామ్ లేకుండా  పదో తరగతి లో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్ అడ్మిషన్లు, ఇంటర్ లో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా  డిగ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయిం సొసైటీ నిర్ణయించింది. త్వరలో డిగ్రీ  అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అందుబాటులో 25 వేల సీట్లు

రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఇంటర్​ కాలేజీలు 261, డిగ్రీ కాలేజీలు 33 ఉన్నాయి. ఇందులో ఇంటర్​, డిగ్రీ కలిపి మొత్తం 25 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీ సీట్లు ఫుల్ అవుతుండగా, సీఈసీ లో సగమే నిండుతున్నాయి. ఇక హెచ్ ఈసీతోపాటు ఇతర కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపించడం లేదు. నిరుడు 25వేల సీట్లకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించగా.. 47,461 మంది పరీక్ష రాశారు. ఎంపీసీ కి 8,624, బైపీసీ 6,463,  సీఈసీ 2,676, ఎంఈసీ 454,హెచ్ఈసీలో 229 సీట్లు ఉన్నాయి.