న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపులకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లెజెండ్ బాక్సర్ మేరీకోమ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ తన నివేదికను ఇటీవలే సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీకి అందజేసింది. ‘రెజ్లర్లు తమపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రుజువు చేయలేకపోయారు.
బల్గేరియాలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకునే టైమ్‌లో బ్రిజ్ ఓ మహిళా ఫిజియోను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆ ఫిజియో ఖండించింది. 2015లో టర్కీలో బ్రిజ్ తనను అనుచితంగా తాకాడని వినేశ్ అఫిడవిట్‌లో పేర్కొంది. కానీ ఆ ఏడాది వినేశ్ అసలు ఆ టోర్నీలోనే పాల్గొనలేదు. 2016లో జరిగిన సంఘటనను ఆమె తప్పుడు వాంగ్మూలంగా ఇచ్చింది. సాక్షి విషయంలోనూ ఇలాగే జరిగింది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ వర్గాలు తెలిపాయి.