సీబీఐ దర్యాప్తు సరిగ్గా లేదు.. ఆర్జీ కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కోర్టుకు బాధితురాలి తల్లిదండ్రులు

సీబీఐ దర్యాప్తు సరిగ్గా లేదు.. ఆర్జీ కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కోర్టుకు బాధితురాలి తల్లిదండ్రులు

కోల్​కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో తాజా విచారణను కోరుతూ వారు గురువారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​ను విచారించేందుకు ఓకే చెప్పిన హైకోర్టు.. కేసును విచారిస్తున్న సీబీఐని పిటిషన్​లో పార్టీగా చేర్చి ఈ నెల 23న మళ్లీ సమర్పించాలని జస్టిస్ తీర్థంకర్ ఘోష్ పిటిషనర్ల తరఫు లాయర్​కు సూచించారు.

కాగా, ఈ ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్​లోని సెమినార్ హాల్​లో ట్రైనీ డాక్టర్ డెడ్​బాడీ లభ్యమైంది. అత్యాచారం తర్వాత ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తాయి.