ENG vs PAK 1st Test: పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. ఫ్రీ ఎంట్రీ అయినా ప్రేక్షకులు లేరు

ENG vs PAK 1st Test: పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. ఫ్రీ ఎంట్రీ అయినా ప్రేక్షకులు లేరు

పాకిస్థాన్ క్రికెట్ నానాటికీ దిగజారుతోంది. క్రికెట్ అంటే ఆ దేశం ఆసక్తి చూపించడం లేదు. చిన్న జట్ల మీద విఫలమవ్వడం.. పెద్ద టోర్నీల్లో కనీస ప్రదర్శన చేయలేకపోవడంతో ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ ను సొంత ఫ్యాన్స్ కూడా పట్టించుకోవట్లేదు. ఇదిలా ఉంటే సొంతగడ్డపై ముల్తాన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ పై జరుగుతున్న టెస్టులో ప్రేక్షకులు లేరు.          

ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో స్టేడియంలో ప్రేక్షకులు కరువయ్యారు. ఎటు చూసిన ఖాళీ స్టేడియం కనిపిస్తుంది. పట్టుమని పది మంది అయినా వచ్చారా అనే అనుమానం కలుగుతుంది. ఫ్రీ ఎంట్రీ అయ్యేసరికి ఈ మ్యాచ్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని భావించినా.. అది జరగలేదు. డ్రింక్స్ విరామం సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ వస్తున్న సమయంలో అతని వెనుక భాగంలో ఒక్కరు కూడా కనబడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చూస్తుంటే ఈ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ ను తలపిస్తుంది.   

ALSO READ | IND vs BAN: ఇది భారత జట్టు కాదు.. ఐపీఎల్ టీమ్: పాక్ మాజీ క్రికెటర్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఓపెనర్ సైమ్ అయూబ్ విఫలమైనా.. మరో ఓపెనర్ అబ్దుల్ షఫీక్(102), కెప్టెన్ షాన్ మసూద్ (151) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 253 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం పాకిస్థాన్ 74 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (20), సౌద్ షకీల్ క్రీజ్ లో ఉన్నారు.