ఈ దివాళీకి టపాసులు కాల్చొద్దు.. అసలు అమ్మొద్దు : ప్రభుత్వం ఆదేశాలు

ఈ దివాళీకి టపాసులు కాల్చొద్దు.. అసలు అమ్మొద్దు : ప్రభుత్వం ఆదేశాలు

దీపావళి పండుగ వస్తుంది.. 2024, అక్టోబర్ 31వ తేదీ.. దసరా అయిపోవటంతో.. ఇప్పుడు అందరి దృష్టి దీపావళిపై పడింది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు కూడా ఓపెన్ కాబోతున్నాయి.. సరిగ్గా టైంలోనే.. ఈ దీపావళికి ఎవరూ టపాసులు కాల్చొద్దని.. అసలు టసాసుల షాపులు పెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. 

ఈ దీపావళిని కొవ్వొత్తులతో సెలబ్రేట్ చేసుకోవాలని.. ఎవరూ టపాకాయలు కాల్చొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. దీనికి కారణం లేకపోలేదు. ఢిల్లీ ఇప్పటికే వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. సహజంగా దీపావళికి వారం రోజుల ముందు ఉంటే వాతావరణ పరిస్థితులు.. ఈసారి 15 రోజుల ముందే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న ఢిల్లీ వాయి కాలుష్యం.. అక్టోబర్ 14వ తేదీకే ఎక్కువ అయిపోయింది.

ఇలాంటి టైంలో దీపావళికి టపాసులు కాల్చినట్లయితే.. అసలు ఢిల్లీలో పీల్చుకోవటానికి గాలే ఉండదు.. ఈ క్రమంలోనే 2025, జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీలో టపాసులు తయారు చేయటం.. నిల్వ చేయటం.. అమ్మటంపై నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. భారీ జరిమానా వేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు మంత్రి రాయ్.

ALSO READ | డేంజర్ లో మన ఫ్యూచర్... క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక

స్వచ్ఛమైన గాలి కోసం.. బతకటం కోసం ప్రజలు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. చలికాలంలో ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. గాలిలో వేగం లేకపోవటం.. చల్లటి గాలులతోపాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలకు తగలబెట్టటం ద్వారా కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది ఢిల్లీలో. ఈ క్రమంలోనే ఈ దీపావళికి టపాసులపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.