
ఉపాధ్యాయులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. 317 జీవో కు వ్యతిరేకంగా, టీచర్లకు మద్దతుగా లక్డికాపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు ముట్టడించారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వారు అక్కడే ఆందోళనను కొనసాగిస్తున్నారు.
స్పౌజ్ బదిలీలు చేయకుండా భార్యభర్తలను వేరు చేసి ప్రభుత్వం వారికి మానసిక వేదనను మిగిలిస్తోందని మైనార్టీ మోర్చా నాయకులు విమర్శించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటివరకు 30 మంది ఉపాధ్యాయులు అతహత్యాలు చేసుకున్నారన్న ఆయన.. కేసీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.