- 48వ కౌన్సిల్ భేటీలో కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: మైనర్ ఇరిగేషన్, బీడీ ఆకులు, పీడీఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో... బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
బీడీలపై ఇప్పటికే 28శాతం జీఎస్టీ భారం ఉందని.. ఇప్పుడు బీడీ ఆకుపై మరో 18శాతం జీఎస్టీ వేస్తే పేద గిరిజనులు, మహిళల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. పేదలు, వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా మినహాయింపులు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు.