అక్కడి ప్రభుత్వం రోటీన్ కు భిన్నంగా నిర్ణయం తీసుకుంది.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలపైనే ఎక్కువగా ఆదాయం పొందుతుందని మనందరికి తెలుసు. అప్పుడప్పుడు మద్యం ధరలు పెంచుతూ ఉంటాయి ప్రభుత్వాలు..అయితే ఈ ప్రభుత్వం మాత్రం బీర్ ప్రియులకు షాకివ్వకుండా.. గుడ్ న్యూస్ చెప్పింది.. ఇంతకీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం రండి..
కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.. బీర్ ధరలు అస్సలు పెంచమని చెప్పింది. దీంతో ట్యాక్స్ పేయర్స్ అదేనండి.. మన మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
ఇంతకీ ఎందుకు కర్ణాటక ప్రభుత్వం బీర్ ధరలు పెంచడం లేదు అంటే..వింటర్ సీజన్ లో బీర్ల అమ్మకాలు బాగా పడిపోయాయట.. మరి అమ్మకాలు పెరగాలంటే ఏదో చేయాలని ఆలోచించి.. బీర్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
కర్ణాటకలో బీర్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయట.. సాధారణంగా వింటర్ సీజన్ లో 10 శాతం అమ్మకాలు పడిపోతాయి.. కానీ ఈ వింటర్ సీజన్ లో 20 శాతం కంటే ఎక్కువగా సేల్స్ తగ్గాయట. వాతావరణం ఎక్కువగా కోల్డ్ గా ఉండటంతో సాధారణం కంటే ఎక్కువగా బీర్ల వినియోగం తగ్గిందట. ఇక ఎండాకాలం వస్తే మాత్రం బీర్ల అమ్మకాలు జోరుగా ఉంటాయి.. దీనిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ యేడాది 36వేల కోట్ల మద్యం అమ్మకాలు జరపాలని ఎక్సైజ్ డిపార్టుమెంట్ కు టార్గెట్ పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు సగం టార్గెట్ కూడా పూర్తి కాలేదట... దీంతో టెన్షన్ లో పడ్డ ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు పెంచకుండా ఉండే తాగేవారు పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తోంది.. ఇది ఓవరాల్ ఎక్సైజ్ ఇన్ కంపై ప్రభావం చూపినా ఎండాకాలంలో రాబట్టుకోవచ్చులే అనుకుంటున్నారట.