గోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ వద్దు

గోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ వద్దు
  • ఉస్మానియా నిర్మాణంపై పునరాలోచించాలి
  • స్థానికులు, ట్రేడర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు : గోషామహల్​స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్​నిర్మాణం అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని స్థానికులు, ట్రేడర్స్​అసోసియేషన్​నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానికులు వినోద్, రాజ్ కుమార్, ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ సతీశ్​రెడ్డి, బేజిని శ్రీనివాస్ బేగంబజార్​లో మీడియాతో మాట్లాడారు. బేగంబజార్ ఏరియాలో రోజంతా ట్రాఫిక్​సమస్య ఉంటోందని, కొత్తగా హాస్పిటల్ నిర్మిస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని చెప్పారు. ఇరుకు రోడ్లలో అంబులెన్స్ లు తిరగడం ఇబ్బంది అవుతుందన్నారు. 

పోలీస్ గ్రౌండ్స్ చుట్టూ నివాసాలు ఉన్నాయని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే పేషెంట్లతో ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఉస్మానియాను సిటీ శివారులో నిర్మించాలని కోరారు. స్టేడియంలోని  పోలీస్ అమరవీరుల స్థూపాన్ని తొలగించడం కరెక్ట్​కాదన్నారు. గోషామహల్​స్టేడియంలో హాస్పిటల్​వద్దంటూ సంతకాల సేకరణ చేపట్టామని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేస్తామని చెప్పారు.