Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్

బడ్జెట్ లో వేతన జీవులకు,  ట్యాక్స్ పేయర్స్, మధ్య తరగతి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది కేంద్ర మంత్రి. రూ.12 లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మిడిల్ క్లాస్ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించనుంది. 

కేంద్ర మంత్రి నిర్మళా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇన్ ట్యాక్స్ లో మార్పులు వస్తాయని యావత్ దేశం ఎదురు చూస్తున్న క్రమంలో ఎలాంటి మార్పులను ప్రస్తుత బడ్జెట్ లో చెప్పలేదు. కానీ కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. 

Also Read :  కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్

ఫిబ్రవరి 2వ వారంలో కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించారు. కొత్త ట్యాక్స్ స్లాబులను కొత్త బిల్లులో చర్చించనున్నారు. 

మరోవైపు బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు 74 శాతం ఉన్న FDI లను కొత్త బడ్జెట్ సందర్భంగా 100 శాతం అనుమతించనున్నట్లు ప్రకటించారు.