భారత్, మాల్దీవుల మధ్య దౌత్య పరమైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య దూరం రోజురోజుకూ పెరిగిపోతుంది. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తూ.. ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకెళ్లాలని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. దానిపై మాల్దీవులు మంత్రులు, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు పూర్తి స్థాయిలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జూ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 4న మాల్దీవులు చైనా ఉచిత సైనిక సహాయాన్ని పొందుతుందని ఒప్పందం చేసుకుంది. మరుసటి రోజే మల్దీవ్ ప్రెసిటెంట్ మే 10 తర్వాత ఇండియన్ ఆర్మీని మా దేశంలోకి అనుమతించమని ప్రకటించాడు.
ALSO READ :- బిగ్ రిలీఫ్ : డీకే శివకుమార్ పై మనీలాండరింగ్ కేసు కొట్టివేత
మార్చి 4న కొంతమంది ఇండియన్ ఆర్మీ మాల్దీవ్స్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు మే 10 తర్వాత సివిలియన్ దుస్తుల్లో కూడా భారత సైనికులను మాల్దీవుల్లోకి అనుమతించమని తేల్చి చెప్పాడు. ఇండియన్ ఆర్మీ తిరిగి వెళ్లడం లేదని సివిలియన్స్ గా మారి వారు మళ్లీ వస్తున్నారని వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. మే 10 తర్వాత సివిత్ డ్రెస్ లో వచ్చే సైన్యాన్ని కూడా అనుమతించమని అన్నారు.