స్వలింగ వివాహాల రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు..

స్వలింగ వివాహాల (Same -Sex Marriage) తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు గురువారం (9 జనవరి 2025) తిరస్కరించింది. ఈ కేసులో కల్పించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపం లేదని భావిస్తు్న్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేమని కోర్టు తెలిపింది. స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం వీలు కాదని స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేయాలంటే పార్లమెంటు  ద్వారా జరగాలని తేల్చి చెప్పింది. 

అదే విధంగా స్వలింగ వివాహం చేసుకున్న జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదని వివరణ ఇచ్చింది. ఈ తీర్పులో మెజారిటీ సభ్యులు ఒకే నిర్ణయం వెలిబుచ్చినట్లు బెంచి స్పంష్టం చేసింది.

ALSO READ | ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

స్వలింగ వివాహనికి చట్టబద్దత లేదని.. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించబోమని సుప్రీం తెలిపింది. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించింది. కలిసి జీవించడాన్ని గుర్తిస్తున్నామని చెప్పింది. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్ట బద్ధత కల్పించలేమని తీర్పునిచ్చింది.  శాసన వ్యవస్థలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

గతంలో ఇచ్చిన తీర్పు ఏంటి..?

2023 అక్టోబర్ లో స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ లో 3-2 మెజారిటీతో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని తీర్పు ఇచ్చింది. పార్లమెంటు ద్వారా నిర్ణయం జరగాలని తేల్చి చెప్పింది. గురువారం (9 జనవరి 2025) మరోసారి రివ్యూ పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీం కోర్టు.