స్పెషల్ అకేషన్స్, పార్టీల్లో లిప్ స్టిక్ వేసుకుంటేనే అందం. అయితే కొందరు రోజూ లిపిక్ పెట్టుకుంటారు. కానీ, వాళ్లలో చాలామందికి లిఫ్టిక్ పెట్టుకున్నాక పెదాలు పగలడం, నల్లగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. అలా కాకూడదంటే ఏం చేయాలో చెబుతోంది డెర్మటాలజిస్ట్ గర్వీన్ వరాయిచ్.
లిప్ స్టిక్ తయారీలో ఆయిల్, వ్యాక్స్ (మైనం) వాడతారు. లిప్ స్టిక్ కి రంగు తేవడం కోసం కొన్ని రకాలు డైలు, పిగ్మెంట్లు వాడతారు. అయితే ఈ పిగ్మెంట్స్
ఉండే మెటల్స్ లో హానికరమైన అక్సైడ్ ఉంటాయి. పిగ్మెంట్లను తక్కువ మోతాదులోనే వాడినప్పటికీ వీటి కారణంగా కొందరిలో పెదాలు పొడిగా, నల్లగా అవుతాయి. నోటి దగ్గరి చర్మం రంగు మారుతుంది కూడా.
అలా కాకుండా ఉండాలంటే
లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదాలకి లిప్ బామ్ రాసుకోవాలి. ముదురు రంగులో ఉన్న లిప్ స్టిక్ కంటే మెరుస్తున్న లిప్ స్టిక్ వాడడం మంచిది. ఎందుకంటే వాటిల్లో పిగ్మెంట్స్ శాతం తక్కువగా ఉంటుంది.
లిప్ స్టిక్ వేసుకున్నాక చేతితో పెదాల్ని పదేపదే ముట్టుకోవడం, పెదాల్ని కొరకడం, ఎండలో ఎక్కువ సేపు ఉండడం లాంటివి చేయకూడదు. అప్పుడప్పుడు లిప్ స్టిక్ బదులు లిప్ బామ్ తో అడ్జస్ట్ అవ్వాలి.