గణేష్ మండపాల దగ్గర పోలీస్ ఆంక్షలు.. కండీషన్స్ ఇవే

మరికొన్ని గంటల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు షురూ..దేశవ్యాప్తంగా శనివారం (సెప్టెంబర్ 06, 2024) గణేషుని ప్రతిష్టాపన జరగనుంది..తొమ్మిది రోజులపాటు గణేషుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.సెప్టెంబర్  17న గణేష్ నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గణేషులకు ఫేమస్  అయిన హైదరాబాద్ మహానగర వాసులు కూడా గణపతి పండగకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. 

అయితే గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ క్రమంలో భక్తులకు గణేష్ మండపాల ఎలాంటి వాతావరణ ఉండాలి.. ఎలా మెసలు కోవాలి అనే దానిపై కొన్ని సూచనలు చేశారు. 

గణేష్ చతర్థి సమీపిస్తున్న క్రమంలో వేడుకలను ఎలాంటి ఆటంకం  లేకుండా ప్రశాంతం నిర్వహించుకునేందుకు హైదరాబాద్ పోలీసులు కొన్ని మార్గదర్శకాలను  విడుదల చేశారు. 

Also Read :- ఏ ఆకు ఏ రోగాన్ని తగ్గిస్తుందో తెలుసుకుందాం..

లాటరీలు, మద్యం సేవించడం, మండపాల్లో రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలపై పరిమితులను విధించారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా వినిపించే సంగీతం, లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని హెచ్చరించారు. 

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని నిర్వాహకులను ఆదేశించారు. విగ్రహాలను రోడ్లు లేదా పేవ్ మెంట్లపై ఉంచకూడదు. 
గణేష్ మండపలాలను పగడ్బందీగా టార్పాలిన్ తో కప్పబడిన పైకప్పులు,  సురక్షితమైన విద్యుత్ కనెక్షన్లతో తాత్కాలిక మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతకోసం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. 

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని చెప్పారు. పర్యావరణ నష్టాన్ని నివారించేందుకు నిర్దేషించిన చెరువుల్లో మాత్రమే విగ్రహ నిమజ్జనాలు చేయాలని సూచించారు. 

వాలంటీర్లు అన్ని సమయాల్లో పండళ్లవద్ద  ఉండాలి.. జూదం, మద్యపానం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.