ఎన్ని వరదలు వచ్చినా మునిగిపోకూడదు.. గోదావరి కరకట్టల మోడల్ను పరిశీలించిన మంత్రి సీతక్క

ఎన్ని వరదలు వచ్చినా మునిగిపోకూడదు.. గోదావరి కరకట్టల మోడల్ను పరిశీలించిన మంత్రి సీతక్క

ప్రతీ ఏటా వర్షా కాలంలో కొన్ని ప్రాంతాలు ముంపు బారిన పడుతూ తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి. భారీ వరదల కారణంగా పంట నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ముంపు ప్రాంతాల ఆవాసాలను, ప్రజలను కాపాడేందుకు కరకట్టల నిర్మాణాన్ని చేపడుతోంది. రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్ లో ఉన్న ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబరేటరీ లో ఈ కరకట్టల నిర్మాణాలకు సంబంధించి మోడల్స్ తయారు చేస్తున్నారు. 

గురువారం (ఏప్రిల్ 10) మంత్రి సీతక్క గోదావరి కరకట్టల నిర్మాణ మోడల్ ను పరిశీలించారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా నిర్మించిన  మోడల్ ను ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబరేటరీలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు మంత్రి సీతక్క. ఇంజనీర్లుగా మీరు ఇచ్చిన మోడల్స్ శాశ్వతంగా నిలిచి పోవాలి.. ఎన్ని వరదలు వచ్చినా మునిగిపోకూడదు అని ఇంజినీర్లకు సూచించారు సీతక్క. 

Also Read : 8వేల ఎకరాల్లో పంటనష్టం.. వడగండ్ల వానపై వ్యవసాయ శాఖ నివేదిక.

‘‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు.. మీరు డిజైన్ చేసిన నిర్మాణాలు శాశ్వతంగా ఉంటే మీ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా పరిశోధనలు చేసి వరద ప్రమాదాలను నివారించే మోడల్స్ రూపొందించండి. ఎంత వరద వచ్చినా కనీస నష్టం జరగకుండా నిర్మాణం ఉండాలి. ఎప్పుడు వరదలు వచ్చినా ములుగు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇక్కడ నిర్మించిన మోడల్ పై మరిన్ని పరిశోధనలు చేసి డిజైన్ ను ఫైనలైజ్ చేస్తాము’’ అని ఈ సందర్భంగా ఇంజనీర్లతో అన్నారు మంత్రి సీతక్క.  ఇంజనీర్లంతా నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ఈ సందర్భంగా అన్నారు.