ఎంత కేర్ తీసుకున్నా.. జుట్టు పొడిబారుతుందా, చివర్లు చిట్లిపోతున్నాయా..

ఎంత కేర్ తీసుకున్నా.. జుట్టు పొడిబారుతుందా, చివర్లు చిట్లిపోతున్నాయా..

ఎంత కేర్ తీసుకున్నా కొన్నిసార్లు జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. దానివల్ల గ్రాండ్ గా హెయిర్ స్టయిల్ చేసుకున్నా లుక్ రాదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే....

• గుడ్డుసొనలో ఒక టీ స్పూన్ తేనె, కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టుకి కావాల్సిన ప్రొటీన్లు అంది పెరుగుతుంది.
• ఒకటీ స్పూన్లివూనె, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో 4 చుక్కల గులాబీనూనె కలిపిజుట్టుకు పట్టించాలి. 20 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు హెల్దీగా ఉంటుంది.

జుట్టు చివర్లు చిట్లకుండా..

• జుట్టు చివర్లు చిట్టడం తగ్గాలంటే... అరటిపండు ప్యాక్ వేసుకోవాలి. అరటిపండు మాస్క్ తయారీ కోసం.. బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల పాలు, కొంచెం తేనె వేసి కలపాలి. ఈ ప్యాక్ ని తలకి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే ఫలితం కనిపిస్తుంది.

• కొబ్బరినూ నెని వేడి చేసి తలకి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు మొత్తానికి పొడి టవల్ చుట్టాలి. కొంచెం సేపటి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలాచేస్తే వెంట్రుకలు పెరగడానికి అవసరమైన పోషకాలు, తేమ అందడమే కాకుండా వెంట్రుకలు చిట్లవు.

Also Read : కేసీఆర్ వల్లే పేదింటి ఆడ బిడ్డల కల నెరవేరుతుంది: హరీశ్ రావు

• జుట్టు బలంగా ఉండడానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు గుడ్డులో ఉంటాయి. అందుకని గుడ్డుతో మాస్క్ తయారుచేసుకొని వేసుకోవచ్చు. ఈ మాస్క్ తయారీ కోసం... గుడ్డు తెల్ల సొన, ఒక స్పూన్ పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిజుట్టుకు రాసుకోవాలి. ముప్పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో వెంట్రుకల్ని శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి ఎగ్ మాస్క్ వేసు కుంటే వెంట్రుకలకొసలు చిట్లిపోవడం తగ్గుతుంది.