న్యూఢిల్లీ: దేశాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నేతలందరూ దృష్టి సారించాలని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో మోడీ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ తో దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కరోనా అంతమయ్యే వరకు పేదల జీవనోపాధి కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు. ‘ప్రపంచం ఈ స్థాయి మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు. కరోనా ఇంకా అంతమవ్వలేదు. రూపాంతరం చెందుతూ మళ్లీ అటాక్ చేస్తోంది. ఈ వైరస్ వల్ల మన దేశమే కాదు, ప్రపంచంలోని మానవ జాతి అంతా తల్లడిల్లుతోంది. దీన్ని అంతం చేసేందుకు అవసరమైన మార్గాలను అందరూ అన్వేషిస్తున్నారు. కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేస్తున్నాం. టీకా వేసుకుంటే మనకు మేలు. అదే సమయంలో ఎదుటివాళ్లకు హాని ఉండదు. కరోనా కష్టకాలంలో పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చాం. కొవిడ్ కట్టడిపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ కోసం వృధాగా డబ్బలు ఖర్చు చేస్తున్నామని ఓ ప్రతిపక్ష సభ్యుడు అన్నారు. ప్రజలు ఇలాంటివి వింటే ఏమనుకుంటారు?’ అని మోడీ చెప్పారు.
మరిన్ని వార్తల కోసం: