బీజేపీ ఎన్ని చేసినా రాష్ట్రంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీనే

మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కీసర, నాగారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 109 కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మాల్లారెడ్డి.. బీజేపీపై పలు కామెంట్లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ మత కల్లోలాలు సృష్టించే విధంగా ప్రజలను రెచ్చగొడుతోందని చెప్పారు. బీజేపీ ఎన్ని చేసినా రాష్ట్రంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టేనని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే ఉంటారని, ఇంకా ఆ పార్టీ వారు గెలిచే ప్రసేక్తి లేదని చెప్పుకొచ్చారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ పై ప్రశంసలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు ఓ అన్నలా అండగా ఉండి కల్యాణ లక్ష్మీ చెక్కులు అందజేసే ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేననన్నారు. పేద ప్రజల కోసం చాలా మంచి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఒక్కే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మంత్రి.... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు త్వరలోనే లబ్ధిదారులకు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.