
- పద్మనాభ స్వామి గుడి ఖర్చులకు పైసల్లేవ్
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన కమిటీ
న్యూఢిల్లీ: కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి గుడి తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోందని, ఖర్చులకు సరిపడా భక్తుల నుంచి కానుకలు రావట్లేదంటూ ఆలయ నిర్వహక కమిటీ సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించింది. ట్రావెన్‌కోర్ రాయల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న గుడికి సంబంధించి ట్రస్ట్‌లపై అడిట్ నిర్వహించాలని కోరింది. నెల ఖర్చులు రూ.1.25 కోట్లు అవుతుండగా తమకు రూ.70 లక్షల దాకా మాత్రమే కానుకల రూపంలో వస్తున్నాయని కమిటీ తరఫు లాయర్ కోర్టుకు చెప్పారు. ట్రస్ట్ దగ్గర రూ.2.87 కోట్ల క్యాష్, రూ.1.95 కోట్ల అప్పులు ఉన్నాయని 2013లో చేపట్టిన ఆడిట్ ద్వారా తెలిసిందన్నారు. దీంతో గుడికి సంబంధించిన ఆస్తులు, తదితర కార్యక్రమాలను నిర్వహించడానికి సంస్థ లేదా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.