
జీడిమెట్ల, వెలుగు : హైదరాబాద్ కొంపల్లి లక్ష్మినగర్‌లోని గెటేడ్ కమ్యూనిటీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి సోమవారం తెలిపిన మేరకు.. మెదక్ జిల్లాకు చెందిన ఆనంద్(21) కొంపల్లిలోని ఓ గెటేడ్కమ్యూనిటీలో ఎలక్ట్రిషియన్. పెండ్లి చేసుకునేందుకు ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇదే కమ్యూనిటీలో ఉండే వెలగపూడి భవానీ శంకర్ కుటుంబం ఊరెళ్లడం చూశాడు.
ఆ ఇంట్లోకి ఎలా వెళ్లాలో తెలిసిన ఆనంద్.. ఇంటి గ్రిల్స్ కట్‌చేసి బెడ్రూమ్ లోకి వెళ్లాడు. బీరువాలో ని రూ.52.50 లక్షల నగదును దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.