- గ్రీన్‌కార్డు కోసం క్యూలో ఉన్న ఇండియన్స్ ఆశలు ఆవిరి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుతో అగ్రరాజ్యంలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ సిటిజన్షిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాలో నివసించే ప్రవాసులకు పుట్టిన పిల్లలకు కండిషన్‌పై ఆటోమేటిక్సిటిజన్షిప్ ఇస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తాను గెలిచిన మొదటిరోజునుంచే అమలయ్యేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల్లో ఒక్కరు యూఎస్ సిటిజన్ లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసితుడైన వారికి పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా యూఎస్ పౌరసత్వం ఇవ్వాలని ఫెడరల్ ఏజెన్సీలకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్డ్రాఫ్ట్ సూచిస్తున్నది.
అలాగే, ఎంప్లాయిమెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డులను 1.40 లక్షలకు.. కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు ఒక్కోదేశానికి 7% చొప్పున పరిమితం చేస్తారు. అయితే, దీన్ని యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణకు తగ్గట్టుగా రూపొందించినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొనగా.. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే కోర్టుల్లో సవాల్ చేయబడుతుందని ఇమ్మిగ్రేషన్ అడ్వొకేట్లు అంటున్నారు. ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ ఎత్తేయడమే ట్రంప్ ప్లాన్ అని, ఇది యూఎస్ రాజ్యాంగంలోని 14 వ సవరణకు విరుద్ధమని ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఖన్నా పేర్కొన్నారు.
ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయితే ప్రవాస భారతీయులకు భారీ ఎదురుదెబ్బ తగలనున్నది. ప్యూ రీసెర్చ్ చేసిన యూఎస్ సెన్సన్ (2022) ప్రకారం.. యూఎస్‌లో దాదాపు 48లక్షల మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. ఇందులో 16 లక్షల మంది అమెరికాలో జన్మించిన వారే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే వీరంతా ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ అర్హత కోల్పోతారు. అలాగే, ఎంప్లాయిమెంట్ బేస్డ్, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్‌కార్డులపై విధించిన పరిమితితో అనేకమంది భారతీయులపై ప్రభావం పడనున్నది.