బెనిఫిట్ షోలు ఇక ఉండవు.. మీరు ఫిక్స్ అయిపోండి : తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

బెనిఫిట్ షోలు ఇక ఉండవు.. మీరు ఫిక్స్ అయిపోండి : తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో తెలుగు సినిమా ఇండస్ట్రీ భేటీ కొనసాగుతుంది. హైదరాబాద్ సిటీలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో.. 2024, డిసెంబర్ 26వ తేదీన జరిగిన సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన విషయాలపై మరోసారి స్పష్టత ఇచ్చారు. 

ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని.. మీరు కూడా దానికి ఫిక్స్ అయిపోవాలని.. ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

బెనిఫిట్ షోలపై.. సినీ ఇండస్ట్రీ నుంచి హాజరైన పెద్దలందరికీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి సినిమా హీరోలు, హీరోయిన్స్ తోపాటు.. సినీ ఇండస్ట్రీలోని వారు తమ భద్రత విషయంలో తీసుకుని బౌన్సర్లపైనా సీరియస్ గా ఉంటామని.. అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తేల్చేశారు సీఎం రేవంత్. 

Also Read :- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి

ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో.. తెలంగాణ రైజింగ్ లో సినీ ఇండస్ట్రీకి సోషల్ రెస్పాన్సిబులిటీ ఉండాలని.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని సూచించారు. మహిళా భద్రత క్యాంపెయిన్ విషయంలో చొరవ తీసుకోవాలని సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంలను ప్రమోట్ చేయాలని.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి భరోసా ఉంటుందని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని.. ఎవరికీ ఎలాంటి ఆందోళనలు వద్దని స్పష్టం చేశారు. ఇదే సమయంలోనే ప్రభుత్వం తరపున సామాజిక కోణంలో సహకరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.