ప్రీమియర్ షోస్ కి సంబందించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా ఇక నుంచి రాష్ట్రంలో అన్నిచోట్ల ప్రీమియయర్ షోలకి పర్మిషన్ ఇవ్వబడదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్ఫర్మ్ చేశారు.
రాత్రి సమయంలో భద్రతా విషయాలని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన మహిళ మృతి గురించి తెలియగా చాలా బాధేసిందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అలాగే భాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read:-రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అనన్య నాగళ్ల క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ!
దీంతో సినిమా లవర్స్ కొంతమేర బాధ పడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రీమియర్స్ సమయంలో థియేటర్లవద్ద హీరోలు, ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉంటుందని కాబట్టి ఈ సమయంలో చిన్నపిల్లలని, హార్ట్ పేషేంట్స్ తదితరులని తీసుకెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేయాలని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా బుధవారం రాత్రి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే ఈమె కుమారుడు శ్రీ తేజ తీవ్ర అస్వస్థతకి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతన్నాడు. అయితే దర్శక నిర్మాతలు స్ సంఘటన తెలుసుకుని మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇక అల్లు అర్జున్ టీమ్ బాలుడి ట్రీట్ మెంట్ కి కావాల్సిన సహాయం అందిస్తన్నారు.