మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్

మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్

తెలంగాణ రాష్ట్రంలో మందు ప్రియులకు షాక్.. ఊహించని ఎదురుదెబ్బ.. మందు ప్రియులు.. అందులోనూ బీరు ప్రియులకు ఎంతో ఇష్టమైన కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేసింది ఆ కంపెనీ. ఇక నుంచి తెలంగాణలో KF బీర్ల సరఫరా చేయలేం అని స్పష్టం చేసింది. 

కింగ్ ఫిషర్ బీర్ ప్రియులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా బేవరేజెస్ కార్పొరేషన్‎కు బీర్ల సప్లై ఆపేస్తున్నట్లుగా కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ ప్రకటించినట్లుగా సమాచారం. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు బీర్ల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వేసవి కాలంలోనూ కింగ్ ఫిషర్ బీర్లు సరిగా సప్లై చేయకపోవడంతో మద్యం షాపుల్లో నో స్టాక్ అంటూ బోర్డులు వెలిసిన సంగతి తెలిసిందే. 
మరో రెండు నెలల్లో వేసవి కాలం స్టార్ట్ కానున్న వేళ కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు.ఇప్పటికే హైదరాబాద్ సిటీలోని కొన్ని మద్యం షాపుల్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేవు. కింగ్ ఫిషర్ బదులుగా ట్యూబర్గ్ లైట్ బీర్లను అమ్ముతున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ఆయా వైన్ షాపులు, బార్లలో ఉన్న స్టాక్ కూడా ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. 

ఈలోపు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా కాకపోతే మాత్రం.. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే మందుబాబులు. మరీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‎ పెండింగ్ బిల్లులను చెల్లించి కేఎఫ్ బీర్ల సరఫరా ఆగిపోకుండా చూస్తుందా..? అలాగే బీర్ రేట్లు పెంచాలన్న కంపెనీ డిమాండ్‏కు ఒకే చెబుతుందా లేదా అనేది వేచి చూడాలి.